హైదరాబాద్ నగరం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన చిన్న శీను (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్ వ్యాధితో బాధపడుతూ నిన్న ఉదయం దవాఖానాలో చేరాడు.
అదే సాయంత్రం డాక్టర్లు పరీక్షించి పరిస్థితి చేజారిందని వివరించారు. అనంతరం రేబిస్ వార్డులోనే చిన్న శీను ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నల్లకుంట పోలీసులు తెలిపారు.