Python in Timber Warehouse : చెట్లను, గుట్టలను ఎక్కి బోర్ కొట్టిందేమో పాపం, అలా ప్రశాంతత కోసమని సేద తీరుదాం అనుకుంది ఆ కొండచిలువ. అడవిలో నరికిన చెట్లతో పాటుగా నగరానికి వచ్చింది. ఎప్పటిలాగే కొండల్లో తిరిగినట్లుగా తిరిగేద్దామనుకుంది. అయితే దానికి తెలియదు పాపం అది మనుషుల మధ్య స్వేచ్ఛగా తిరగలేనని. ఇంకేముంది, అందులో పని చేస్తున్న వ్యక్తి ఆ కొండచిలువను గమనించాడు. ఒక్కసారిగా భయపడిపోయాడు. వెంటనే తెరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన కాకినాడ జిల్లా జగన్నాధపురంలో చోటు చేసుకుంది.
అడవిలో బోర్ కొట్టిందేమో పాపం, జనావాసాల్లోకి వచ్చింది - జనావాసాల్లోకి కొండ చిలువ
Snake చెట్లను, గుట్టలను ఎక్కి బోర్ కొట్టిందేమో పాపం, అలా ప్రశాంతత కోసమని సేద తీరుదాం అనుకుంది ఆ కొండచిలువ. అడవిలో నరికిన చెట్లతో పాటుగా నగరానికి వచ్చింది. ఎప్పటిలాగే కొండల్లో తిరిగినట్లుగా తిరిగేద్దామనుకుంది. రంగంలోకి దిగిన అటవీ అధికారులు కొండచిలువను పట్టుకున్నారు.
![అడవిలో బోర్ కొట్టిందేమో పాపం, జనావాసాల్లోకి వచ్చింది Python in Timber Warehouse in Kakinada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16218668-24-16218668-1661663311071.jpg)
అడవిలో బోర్ కొట్టిందేమో పాపం, జనావాసాల్లోకి వచ్చింది
టింబర్ డిపోలో చెక్కల మధ్య కొండచిలువ చిక్కుకుంది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు కొండచిలువను పట్టుకున్నారు. పాముని తూరంగి మడ అడవుల ప్రాంతంలో వదిలేశారు. కలపతోపాటు అటవీ ప్రాంతం నుంచి కొండచిలువ వచ్చినట్టు తెలిపారు.
అడవిలో బోర్ కొట్టిందేమో పాపం, జనావాసాల్లోకి వచ్చింది
ఇవీ చదవండి:
Last Updated : Aug 28, 2022, 11:52 AM IST