ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

AD SUICIDE: నమ్మకస్తులు మోసం చేశారని.. పశు సంవర్ధకశాఖ ఏడీ ఆత్మహత్య - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

AD SUICIDE: పుట్టపర్తి పశు సంవర్ధకశాఖ ఏడీ రాము ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతిథి గృహంలో మంగళవారం ఆయన విగతజీవిగా కనిపించారు. ఏడీ ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు ఒక లేఖ లభించింది. నమ్మినవారే మోసం చేశారని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మవరం ప్రాంతానికి చెందిన కొందరు మోసం చేశారని ఆ లేఖలో ఏడీ రాశారు.

AD SUICIDE
AD SUICIDE

By

Published : Jul 6, 2022, 8:58 AM IST

AD SUICIDE: పుట్టపర్తి పశు సంవర్ధకశాఖ ఏడీ రాము అనంతపురంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతిథి గృహంలో మంగళవారం ఆయన విగతజీవిగా కనిపించారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన రాము 6 నెలల కిందట డిప్యుటేషన్‌పై డీఆర్‌డీఏ కార్యాలయంలో డీపీఎంగా బదిలీ అయ్యారు. పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ఉన్న అతిథి గృహంలో ఉంటున్నారు. మంగళవారం గది తలుపులు తెరిచి ఉండటంతో సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా ఏడీ ఉరి వేసుకుని కనిపించారు. ఆయన భార్య రాణి కర్నూలు పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. వారికి కుమార్తె ఉన్నారు. కుటుంబం కర్నూలులోనే ఉంటోంది. రాము శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పుట్టపర్తిలలో సుమారు ఆరేళ్లపాటు ఏడీగా పని చేశారు. పశువులకు ఏదైనా జబ్బు చేస్తే వెంటనే స్పందించి వైద్య సేవలు అందించేవారని స్థానికులు చెబుతున్నారు. ఏడీ ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు ఒక లేఖ లభించింది. నమ్మినవారే మోసం చేశారని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మవరం ప్రాంతానికి చెందిన కొందరు మోసం చేశారని ఆ లేఖలో ఏడీ రాశారు.

ABOUT THE AUTHOR

...view details