Accident at Paidi bhimavaram: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై ఆగిఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జుగా మారింది.
Accident: శ్రీకాకుళం జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 30 మందికి గాయాలు - srikakulam district news
Accident at Paidi bhimavaram
08:40 February 19
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 30 మందికి గాయాలు
ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు బస్సు ఒడిశా నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా ఒడిశాకు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:
మద్యం తరలిస్తూ పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. సీసీ టీవీలో నమోదైన ప్రమాద దృశ్యాలు
Last Updated : Feb 19, 2022, 12:18 PM IST