ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి గర్భిణి బలి.. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు - హిమాయత్‌నగర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం

హైదరబాద్​లోని హిమాయత్‌నగర్​ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భార్యభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీనితో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో నిండు గర్భిణి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

pregnant women dies in Hyderabad
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి గర్భిణి బలి

By

Published : Feb 24, 2021, 9:15 PM IST

లైవ్​ వీడియో.. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి గర్భిణి బలి

హైదరాబాద్​లోని హిమాయత్‌నగర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతిచెందింది. ముషీరాబాద్ బాకారానికి చెందిన సతీశ్‌ గౌడ్‌‌, షాలిని దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొని అదుపుతప్పి కింద పడిపోయారు.

ఈ క్రమంలో మహిళ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణ గూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేష్ వారిని ఎత్తుకొని అటుగా వెళ్తున్న అంబులెన్స్​లో ఎక్కించారు. చికిత్స నిమిత్తం స్థానిక అపోలో హాస్పిటల్​కు తరలించగా.. తీవ్ర రక్తస్రావంతో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయి. మృతురాలి భర్త సతీష్ గౌడ్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఇవీచూడండి:

గుంటూరు జిల్లాలో రెండేళ్ల బాలుడు అపహరణ.. రంగంలోకి పోలీసులు!

ABOUT THE AUTHOR

...view details