SUICIDE:ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరులో కోపరేటివ్ బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక.. రాంబాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుడి భార్య ఆరోపించారు. పోతునూరు సహకార సంఘంలో రాంబాబు గత కొన్ని సంవత్సరాలుగా సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల నుంచి రావాల్సిన డబ్బులు ఆలస్యం కావడంతో.. చింతలపూడి బ్యాంక్ మేనేజర్, నోడల్ అధికారి, ఏలూరు డీసీసీబీ బ్యాంక్ అధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ఆరోపించారు. అపస్మారక స్థితిలో ఉన్న రాంబాబును గుర్తించిన కొందరు వ్యక్తులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోతునూరు సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య.. అదే కారణమా? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
SUICIDE: పోతునూరు సహకార సంఘం కార్యదర్శి రాంబాబు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని అతని భార్య ఆరోపించింది.
SUICIDE
Last Updated : Jul 8, 2022, 10:41 AM IST
TAGGED:
ap latest news