POLICE SOLVED THE MURDER CASE : తిరుపతి జిల్లాలోని కైలాసకోన ప్రాంతంలో గత నెల ఒకటో తారీఖున అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ మహిళ కేసును నారాయణపురం పోలీసులు చేధించారు. భర్తే మహిళను హత్య చేసి అక్కడ వదిలేసి వెళ్లినట్లు విచారణలో తెలిసినట్లు వెల్లడించారు.
డీఎస్పీ విశ్వనాథ్ కథనం ప్రకారం.. "తమిళనాడులోని చైన్నై రెడ్ హిల్స్‌కు చెందిన మదన్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం తమిళసెల్వి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన మదన్.. అతని భార్యతో ప్రతి రోజు గొడవ పెట్టుకునేవాడు. గొడవలతో విసుగు చెందిన మదన్.. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. అందుకోసం అతను చదువుకునే రోజుల్లో సందర్శించిన జిల్లాలోని కైలసకోన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా జూన్ 26న భార్యకి మాయమాటలు చెప్పి.. జలపాతం వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం అతని వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేసి అక్కడ చెట్ల పొదల్లో పడేసి పారిపోయాడు" అని తెలిపారు.