ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

murder mystery: రూ.500, 1000కే హత్యలు.. నివ్వెరపోయిన పోలీసులు - తెలంగాణ నేరవార్తలు

డబ్బుల కోసం కొంత మంది హత్యలు చేస్తుంటారు. లక్షలు, కోట్లు కాజేస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం 500, 1000 రూపాయల కోసం హత్యలు చేశాడు. ఓ కేసు విచారణలో నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారించిన పోలీసులు.. అతడు మరో రెండు హత్యలు చేశానని..అంగీకరించడంతో కంగుతిన్నారు.

Murder mystery
Murder mystery

By

Published : Aug 11, 2021, 7:25 AM IST

తెలంగాణ నిజామాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నేరాలకు పోలీసులు నివ్వెర పోయారు. ఒక కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయగా.. అతడు మరో రెండు హత్యలు చేసినట్లు నిర్ధరించారు. కేవలం 500, 1000 రూపాయలకు హత్యలకు పాల్పడినట్లు చెప్పడంతో కంగుతిన్నారు.

మరో మూడు హత్యలు చేసినట్లు అంగీకారం..

డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులోని వైకుంఠధామం పక్కన.. ఈ నెల 5న ఓ మహిళ హత్యకు గురైంది. మిట్టాపల్లికి చెందిన నర్సమ్మగా గుర్తించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమలాపూర్‌కు చెందిన మహమ్మద్ షారూఖ్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. వృద్ధురాలిని చంపినట్లు ఒప్పుకున్న నిందితుడు... మరో 3 హత్యలు చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు.

మద్యానికి బానిసై..

మహమ్మద్‌ షారూఖ్‌.. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం రైల్వే పట్టాల పక్కన పడుకునే.. సల్మాన్‌ఖాన్‌ అనే వ్యక్తిని హతమార్చి 500 రూపాయలు, చేతి గడియారాన్ని దొంగలించినట్లు వివరించారు. ఆరు నెలల క్రితం ఘన్‌పూర్‌కు చెందిన షేక్​ మోసిన్‌తో కలిసి మద్యం తాగుతున్న సమయంలో తిట్టాడనే కోపంతో గ్రానైట్‌ రాయితో మోది హత్య చేశాడని తెలిపారు. మోసిన్‌ నుంచి 750 రూపాయలు దొంగిలించాడని పోలీసులు వెల్లడించారు. మద్యానికి బానిసై షారూఖ్‌ హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి: cm jagan: చేనేతల కష్టాలు మరచిపోను

ABOUT THE AUTHOR

...view details