తిరుపతి:జిల్లాలో రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ బడా స్మగ్లర్‌తో పాటు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తిరుపతి-నగరి జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద చెన్నై వైపు వెళ్తున్న కారు, ఒక మినీ వాహనాన్ని ఆపారు. వాటిని తనిఖీ చేయగా 191 దుంగలు, 8 గోనె సంచుల్లో చిన్న ఎర్రచందనం ముక్కలు దొరికాయి. నిందితుల్లో సెంథిల్ కుమార్ అనే స్మగ్లర్ విదేశాలకు ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్‌లు.. భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
RED SANDALWOOD: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎర్రచందనం దుంగలను తరలించే ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లాలో రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, శ్రీసత్యసాయి జిల్లాలో 40 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీసత్యసాయి: జిల్లాలో ఎర్రచందనాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లి కూడలి వద్ద 44వ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 40 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గుట్టూరు గ్రామానికి చెందిన మజ్జిగ లక్ష్మీనారాయణ అనే గ్రామ వాలంటీర్ సహకారంతో 9మంది నిందితులు.. చిగిరాల అడవిలో ఎర్రచందనం చెట్లు నరికి దుంగలు నిల్వ చేశారు. అక్కడినుంచి బెంగళూరుకు తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు.. 262 కిలోల బరువున్న దుంగలను సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: SI suicide: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య