కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సినీహబ్ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గ్రామీణ పోలీసు స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణ అతడిని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులులేని సుమారు 2.9 కిలోల బంగారంతో పాటు, రూ.7లక్షలు నగదును గుర్తించారు. బంగారం విలువ కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బంగారంతో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.
కొత్తపల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీలు..