GANJA: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ రైల్వేన్యూకాలనీలో జరిపిన తనిఖీల్లో గంజాయిని గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన జహీర్ ఖాన్ రెహ్మాత్ ఖాన్, షేక్ మొహ్సేన్, విజయ్ మనోహర్ హారానా, హైదరాబాద్ కు చెందిన మహ్మాద్ షఫీఖాన్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 40 కిలోల గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గంజాయి అటు దాటించాలనుకున్నారు.. ఇటు పట్టుబడ్డారు - విశాఖ జిల్లా తాజా వార్తలు
GANJA: విశాఖ రైల్వే న్యూకాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం
మరో తనిఖీలో రైల్వేస్టేషన్ ప్రాంతంలోని జ్ఞానాపురం ద్విచక్ర వాహనాల పార్కింగ్ వద్ద గంజాయిని తరలిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సెబ్ అధికారి తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : May 21, 2022, 12:18 PM IST