GOLD RECOVERY: వైఎస్సార్ జిల్లాలోని బీకేఎం వీధిలోని మెహతా బంగారు దుకాణం నుంచి ఆభరణాలు ఎత్తికెళ్లిన వ్యక్తిని పోలీసులు 4 గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుడిని దుకాణంలో పనిచేసే గుమస్తాగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కేసును నాలుగు గంటల్లోనే చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. రెండున్నర కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు! - వైఎస్సార్ జిల్లా తాజా వార్తలు
GOLD RECOVERY: అతను ఓ బంగారు దుకాణంలో 20 ఏళ్లు నుంచి గుమస్తాగా పనిచేస్తున్నాడు. అయితే.. ఏళ్లతరబడి తానుచేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు. దానికి ఏం చేయాలా అని ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. ఇంకేముంది? ఆ ప్లాన్ అమలు చేశాడు. కానీ.. చివరకు ఉపాయం బెడిసికొట్టింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు..!
అసలేం జరిగిందంటే..?
బీకేఎం వీధిలోని మెహతా జ్యువెలరీ దుకాణంలో మసూద్ అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి గుమాస్తాగా పనిచేస్తున్నాడు. తనకున్న అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో యజమాని దుకాణంలోనే దొంగతనం చేయాలనుకున్నాడు. అదే అదనుగా భావించి యజమాని ఇంటికి వెళ్లిన సమయంలో రెండున్నర కిలోల బంగారంతో తిరుపతికి ఉడాయించాడు.షాపులో దొంగతనం జరిగిందని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... రైల్వేకోడూరు వద్దనున్న బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద బస్సులో వెళ్తున్న మసూద్‌ను పట్టుకున్నారు.
ఇవీ చదవండి: