Cash Fraud : విజయనగరం జిల్లా కొండ కరకానికి చెందిన మజ్జి అప్పలరాజు అనే వ్యక్తి పప్పుల చీటీ పేరుతో సుమారు 25 వేల మందిని మోసం చేశాడని డీఎస్పీ మోహనరావు తెలిపారు. నిందితుడు గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకూ.. నెలకు 300 రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు పేర్కొన్నారు. క్రిస్‌మస్, సంక్రాంతి పండగలకు 24 రకాల వస్తువులు ఇస్తానని చెప్పి అప్పలరాజు వసూళ్లకు పాల్పడ్డాడని తెలిపారు. సుమారు 25 వేల మంది నుంచి వసూళ్లకు పాల్పడినట్టు వివరించారు. అప్పలరాజు తన తమ్ముడు రమేష్, శ్రీలేఖ అనే మహిళ ద్వారా ప్రజల నుంచి నగదు సేకరించారని వెల్లడించారు. సేకరించిన సొమ్ముతో పరారైనట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తి దర్యాప్తు చేపడ్తామని అన్నారు.
25 వేల మందిని మోసం చేసిన ఘనుడు.. కేసు నమోదు
Cash Fraud : విజయనగరం జిల్లాలో పప్పుల చిటీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను వసూలు చేసింది ఒకరి ఇద్దరి వద్ద నుంచి కాదు.. సుమారు 25 వేల మంది నుంచి నగదు వసూలు చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
పప్పుల చిటీ పేరుతో మోసం