ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో 8 మంది అరెస్టు, మరొకరు పరారీ - Ap Latest news

Constable Murder Case నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Police have arrested the accused in Nandyla Constable
నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Aug 21, 2022, 7:43 PM IST

Accused arrest in Constable murder case: ఈనెల 7వ తేదీన నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్రనాథ్​ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సురేంద్రనాథ్​కు రోడ్డు పక్కన మద్యం తాగుతున్న రౌడీషీటర్లు కనిపించారు. రోడ్డు పక్కన మద్యం తాగుతున్న వారిని ప్రశ్నించగా.. బీరు సీసాలతో దాడి చేశారు. అక్కడినుంచి తప్పించుకునేందుకు చూసిన సురేంద్రనాథ్​ను వెంటాడి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ హత్య కేసులో మొత్తం 9 మంది నిందితులు పాల్గొన్నారని.. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని రేంజ్ డీఐజీ సింథేల్ కుమార్ తెలిపారు. ఈ హత్య కేసులో 4 రౌడీ షీటర్లు ఉన్నారని ఆయన తెలిపారు.

నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

హత్య జరిగింది ఇలా : టెక్కెలోని టాటూ దుకాణం వద్ద మద్యం తాగుతూ, అల్లరి చేస్తున్న రౌడీషీటర్లు కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌కు (35) కనిపించారు. ఎందుకు అల్లరి చేస్తున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కానిస్టేబుల్ వారికి సూచించాడు. దీంతో కోపోద్రిక్తులైన రౌడిషీటర్లు కానిస్టేబుల్​తో గొడవకు దిగారు. మాట్లాడుతుండగానే తమ వద్ద ఉన్న బీరు సీసాలతో సురేంద్ర తలపై దాడి చేశారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు సురేంద్రనాథ్ పద్మావతి సర్కిల్‌ వైపు పరుగులు తీశారు. నిందితులు అతడిని వెంటపడి పట్టుకుని పక్కనే ఉన్న ఆటోలో ఎక్కించారు. ఆటోడ్రైవర్‌ను కొట్టి, అతని మెడపై కత్తి పెట్టి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లారు. తలకు దెబ్బ తగలడంతో అప్పటికే స్పృహ కోల్పోయిన సురేంద్రనాథ్ చాతీ, వీపుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనాస్థలి నుంచే ముగ్గురు పరారుకాగా, మరో ఇద్దరు పట్టణంలోకి వచ్చి బుల్లెట్‌ వాహనాలపై వెళ్తున్న వారిని కొట్టి వారి వాహనాలు తీసుకొని పరారైనట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details