murders at kothagudem: తెలంగాణలోని హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల సరిహద్దుల్లో ఓ మహిళ, యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. యాదాద్రి జిల్లా కొత్తగూడెం వంతెన వద్ద కుళ్లిన స్థితిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే వారిగా పోలీసులు గుర్తించారు. వారాసిగూడకు చెందిన యశ్వంత్ గత ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని కొత్తగూడెం వంతెన వద్ద కంపచెట్ల మధ్య నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ లభ్యమైన ఆధారాలు పరిశీలించగా మృతులు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ద్విచక్రవాహనం, ఘటనాస్థలిలో లభించిన బ్యాగులో ఉన్న ఆధారాలతో వీరు వారాసిగూడకు చెందిన వారిగా గుర్తించారు.
మా అన్న డ్రైవింగ్ చేస్తాడు. ఆదివారం నా బండి తీసుకపోయిండు. అమ్మాయి కూడా ఎవరో తెల్వదు. చిన్న చిన్న గొడవలు అయితుండే. అవి కూడా కాంప్రమెజ్ అయ్యుండే. మాకు ఎవరి మీద అనుమానం లేదు. - అనిరుధ్, మృతుని సోదరుడు