Illegal Marijuana Burnt: విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్‌లో అక్రమ గంజాయిని పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 29 పోలీస్ స్టేషన్ల పరిధిలో 518 అక్రమ గంజాయి కేసులు నమోదు చేశారు. 21,961 కేజీలు.. తొమ్మిది కోట్ల 2లక్షల 44 వేల రూపాయల విలువైన అక్రమ గంజాయిని, 23 కేజీల గంజాయి ఆయిల్, 960 గ్రాముల గంజాయి చాక్లెట్‌ను ధ్వంసం చేశారు. మాదకద్రవ్యాల వల్ల యువత చెడుదారి పడుతున్నారని, అంతర్రాష్ట్ర ముఠాలను అరికట్టడమే ధ్యేయంగా పని చేస్తున్నామని సీపీ శ్రీకాంత్ తెలిపారు.
విశాఖలో రూ.9 కోట్ల విలువైన అక్రమ గంజాయి ధ్వంసం - విశాఖ జిల్లాలో అక్రమ గంజాయి
Illegal Marijuana Burnt: విశాఖ జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్‌లో అక్రమ గంజాయి, గంజాయి ఆయిల్‌ను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 29 పోలీస్ స్టేషన్ల పరిధిలో 518 అక్రమ గంజాయి కేసులు నమోదు చేశారు.
గంజాయి
గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల సమాచారం కోసం 14500కు కాల్ చేయాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి విషయాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ సుమిత్ గార్గ్ నార్త్ ఏసీపీ శ్రీనివాసరావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :