వయసు 17 ఏళ్లు.. చోరీల లిస్ట్ 44.. తాళం వేసి ఉన్న, వృద్ధులున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటాడు. అదును చూసి ఇంట్లో ఉన్నదంతా హాంఫట్ చేసేస్తాడు. చివరికి రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులకు చిక్కాడు. రాజమహేంద్రవరం వీవర్స్‌కాలనీలో ఈనెల 23న అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో 12కాసుల బంగారు ఆభరణాలు, ఓ సెల్‌ఫోన్ చోరీ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు గోకవరం బస్టాండు సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. ఈ నెల 26న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
చోరీల్లో ఆరితేరిన బాలుడు.. వరుస దొంగతనాలతో హల్చల్ - a boy thief at rajamahendra varam
వయసు 17.. కానీ చేసిన చోరీలు 44. వయసుకు మించి చోరీలు చేసి రాజమహేంద్రవరంలో ఓ బాలుడు హల్చల్ చేస్తున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి దొరికిందంతా దోచేస్తున్నాడు. ఎట్టకేలకు రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులకు చిక్కాడు.
thief
నిందితుడిని విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కాకినాడ ఒకటో పట్టణ, లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీ, జిల్లాలోని పలుచోట్ల జరిగిన 44 చోరీ కేసుల్లో నిందితుడని తేలింది. అతని నుంచి 12 కాసుల బంగారు ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసును ఛేదించిన మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై కేవీ రామారావు, క్రైమ్ హెచ్‌సీ పి.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావును అర్బన్ ఎస్పీ ఐశ్వర్యరస్తోగి అభినందించారు.
ఇదీ చదవండి: