Police arrested two thieves in AP: వైఎస్ ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబుబ్నగర్ చెందిన పాత నేరస్తుడు వెంకటేశు, విజయవాడకు చెందిన మస్తాన్ ఇద్దరు ఈ చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. గతంలో కూడా ఇద్దరు నిందితులు పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు.. ఆయా పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. రూ.12 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ వివరించారు.
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్.. 32 తులాల బంగారం స్వాధీనం - ఏపీలో 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
Police arrested two thieves: గత కొంత కాలంగా ప్రొద్దుటూరులో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.12 లక్షల విలువచేసే 32 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ వెల్లడించారు.
Police arrested two thieves