KEY ACCUSED ARREST IN SANKALP SIDDHI CASE : సంకల్ప సిద్ధి మనీ సర్క్యులేషన్ కేసులో కీలక నిందితుడు కిరణ్‌ను.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న కిరణ్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు కర్ణాటకలో జల్లెడ పట్టి.. బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మనీ సర్క్యులేషన్ కేసులో.. ప్రధాన నిందితుడు గుత్తా వేణుగోపాల్‌తోపాటు.. గుత్తా కిషోర్, గంజాల లక్ష్మీ., మావూరి వెంకట నాగలక్ష్మి, సయ్యద్ జాకీర్ హుస్సేన్‌లను పోలీసులు గత నెల 28న అరెస్టు చేశారు.
సంకల్ప సిద్ధి మనీ సర్క్యులేషన్ కేసు.. కీలక నిందితుడు అరెస్ట్ - latest updates in sankalp siddhi case
KEY ACCUSED ARREST IN SANKALP CASE : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంకల్ప్ సిద్ధి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా కీలక నిందితుడు కిరణ్‌ను సైతం బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
KEY ACCUSED ARREST IN SANKALP CASE
ఈ కేసులో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు నిందితులను.. 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. వారం రోజులు ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని లోతుగా విచారిస్తే.. మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. గుణదల విద్యుత్ సౌధలోని విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఇద్దరు అధికారులు.. తమకు తెలిసిన వారితో..2కోట్లు వరకు డిపాజిట్లు చేయించినట్లు తెలిసింది. వీరి వివరాలను కూడా పోలీసులు నమోదు చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి: