Fake Documents Created Man Arrested : పల్నాడు జిల్లాలో ఖాళీ స్థలాలను లీజుకు తీసుకుని.. నకిలీ పత్రాలను సృష్టించి విక్రయిస్తున్న కేటుగాడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన సురభి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నకిలీ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు, దొంగ స్టాంప్లు తయారుచేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తీగ లాగితే డొంక కదిలినట్లు తన భూమిని తనకే తెలియకుండా వెంకటేశ్వర్లు విక్రయించడాని నేరేళ్ల పాపారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించాగా అసలు నిజాలు బయటికి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెళ్ల పాపారావు పేరుతో వెంకుపాలెం గ్రామంలో 6.75 ఎకరాల భూమిని వెంకటేశ్వర్లకు చెందిన భూమిగా పత్రాలు సృష్టించాడు. ఆ భూమిని డేరంగుల శ్రీనివాసరావు, కుందనపు సూర్యనారాయణ అనే వ్యక్తులకు 15 లక్షల రూపాయలకు విక్రయించాడు. అంతేకాకుండా చల్లా నాగేంద్రం అనే మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు.
నకిలీ పత్రాలతో ఖాళీగా ఉన్న భూములను విక్రయిసున్న కేటుగాడు - fake documents news
Fake Documents Created Man Arrested : పల్నాడు జిల్లాలో భారీ మోసానికి తెర లేపాడు ఓ కేటుగాడు. ఖాళీగా ఉన్న భూములను తన పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి విక్రస్తున్నాడు. కేవలం భూముల అమ్మకాలు మాత్రమే కాకుండా.. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు మోసం వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న నేరేళ్ల పాపారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు జరిగిన విషయం చెప్పటంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. లోతుగా విచారించగా ఇదే కాకుండా అతని వద్ద తహసీల్దార్, సబ్ రిజిస్టర్, ఆర్డీవో పేర్లతో ఉన్న స్టాంపులు తయారు చేస్తున్నడాని గుర్తించారు. నకిలీ అధార్కార్డులు, తన పేరు డాక్యుమెంట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి వందల సంఖ్యలో రెవెన్యూ రికార్డులు, డాక్యుమెంట్లు పట్టుబడినట్లు తెలిపారు. ఇతనికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తుల పైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేంకటేశ్వర్లు పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతని ద్వారా మోసపోయిన వారు ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారని వెల్లడించారు. పూర్తి దర్యాప్తు జరిపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: