ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

సుపథం టికెట్లను సేవా టికెట్లుగా మార్చి విక్రయం.. వ్యక్తి అరెస్ట్​ - Supadam Tickets Fraud

Supadam Tickets Fraud : తిరుమల సుపథం టికెట్లను సేవా టికెట్లుగా మార్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Supatham Tickets Fraud
Supatham Tickets Fraud

By

Published : Oct 30, 2022, 4:34 PM IST

Updated : Oct 30, 2022, 6:54 PM IST

Tickets Fraud in Tirumala: తిరుమలలో సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించిన కరుణాకర్ అనే వ్యక్తిని తితిదే విజిలెన్సు సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డి లేఖతో 12 టికెట్లు పొందిన కరుణాకర్.. వాటిని కర్ణాటకకు చెందిన భక్తులకు రూ.32 వేలకు విక్రయించినట్లు తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. తితిదే విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరుణాకర్​పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నిషియన్‌గా కరుణాకర్​ పని చేస్తున్నట్లు వెల్లడించారు.

కరుణాకర్​ కాణిపాకం దేవాలయంలో గ్యాస్​ టెక్నీషియన్​గా పని చేస్తున్నాడు. ఆలయ ఏఈవో సహాయంతో 12 సుపథం టికెట్లు పొంది.. వాటిని కర్ణాటకకు చెందిన భక్తులకు రూ.32వేలకు విక్రయించాడు. తితిదే సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కాణిపాకం ఏఈవోని విచారిస్తున్నాము.-తిరుమల ఏఎస్పీ మునిరామయ్య

సుపథం టికెట్లను సేవా టికెట్లుగా మార్చి విక్రయం.. వ్యక్తి అరెస్ట్​

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2022, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details