AOB: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు అరెస్టు - ఏపీ తాజా వార్తలు
Maoists Arrest
10:07 August 12
మావోయిస్టుల అరెస్టు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించిన వివరాలను వెల్లడించనున్నారు.
Last Updated : Aug 12, 2021, 10:41 AM IST