ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

GANJA CASE: రెండేళ్ల క్రితమే బండి అమ్మేశాడు.. గంజాయి కేసులో బుక్కయ్యాడు..! - ap latest crime news

విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఓ మహిళ.. అన్యాయంగా పోలీసులు తన భర్తను గంజాయి కేసులో అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త రెండేళ్ల క్రితమే బండి అమ్మినప్పటికీ... ఆ బండిపై వెళ్తున్న వ్యక్తే నిందితుడంటూ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణమని వాపోతోంది.

police-arrest-hotel-manager-in-cannabis-case-at-pader
రెండేళ్ల క్రితమే బండి అమ్మేశాడు.. గంజాయి కేసులో బుక్కయ్యాడు..!

By

Published : Oct 29, 2021, 12:12 PM IST

Updated : Oct 29, 2021, 1:00 PM IST

రెండేళ్ల క్రితమే బండి అమ్మేశాడు.. గంజాయి కేసులో బుక్కయ్యాడు..!

అమాయకుడైన తన భర్తను పోలీసులు అన్యాయంగా గంజాయి కేసులో అరెస్ట్‌ చేశారంటూ... పాడేరుకు చెందిన ఓ మహిళ వాపోతోంది. ఈనెల 13న విశాఖ జిల్లా చీడికాడ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా....ఓ ద్విచక్రవాహన దారుడు బండి వదిలి పరారయ్యాడు. ఆ బండి నెంబర్‌ను బట్టి పాడేరులో కాకా హోటల్ నడిపే శివ వాహనంగా పోలీసులు గుర్తించారు. బండి రెండేళ్ల కిందటే వేరే వ్యక్తికి అమ్మేశానని చెప్పినప్పటికీ... సంతకం పెట్టాలని స్టేషన్‌కు తీసుకెళ్లారని బాధితుడి భార్య వెల్లడించింది. బండి కొనుగోలు చేసిన రఘునాధ్ ఇంటికి వెళ్లగా.... పరారీలో ఉన్నాడని తెలిపింది. గంజాయి కేసులో పరారైన బండి కొన్న వ్యక్తి దొరకగానే పంపిస్తామని చెప్పిన పోలీసులు... ఇప్పుడు నా భర్త మీద కేసు పెట్టి కటకటాల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Last Updated : Oct 29, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details