ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దివ్యాంగుడి సజీవదహనం.. వెంట ఉన్న మహిళేనా నిందితురాలు ?

Person with disability was killed: అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి వికలాంగుడి సజీవ దహనం ఘటన కలకలం సృష్టించింది. పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వెంట వచ్చిన మహిళనే నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు.

Person with disability was killed
Person with disability was killed

By

Published : Dec 16, 2022, 4:20 PM IST

Person with disability was killed in AP: అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో దివ్యాంగుడిి సజీవ దహనం ఘటన కలకలం రేపింది. మృతుడి వెంట ఉన్న రాణెమ్మ అనే మహిళే అతడిపై పెట్రోల్ పోసి హతమార్చిందా.. లేక మరెవరైన ఈ ఘటనకు పాల్పడ్డారా అన్న విషయం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. రాజంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుమారు 40 ఏళ్లకు పైబడిన వికలాంగుడిపై గత రాత్రి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు పేర్కొన్నారు. మృతుడు కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట ప్రాంతానికి చెందిన అంకాల్ రెడ్డిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి తిరుపతి వైపు నుంచి మైదుకూరుకు ఓ మహిళ సహాయంతో వెళుతున్నట్లు మృతుడి వద్ద లభించిన బస్సు టికెట్ల ఆధారాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో పోలీసులు అమర్చిన సీసీ కెమెరాలో సైతం ఓ మహిళ అర్ధరాత్రి 12 గంటల సమయంలో అనుమానాస్పదంగా ఉండటం గుర్తించామని పోలీసులు తెలిపారు. అంకాల్ రెడ్డితో రాణెమ్మనే మహిళ సహజీవనం చేస్తుందని.. అతనిని రాణెమ్మే హత్య చేసేనట్లు మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details