తెలంగాణలోని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో పుట్ట మధు ఉన్నారు. వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పుట్ట మధును... అదృశ్యంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే వామన్‌రావు హత్య కేసులో మధును పోలీసులు విచారించారు. వామన్‌రావు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులోని అంశాలపై పుట్ట మధును పోలీసులు ప్రశ్నిస్తున్నారు.