అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ భాస్కరన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు కడప జిల్లా ఎస్పీ అంబురాజన్ తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు అతనిపై జిల్లాలో 29 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడిపై డీఆర్ఐ చెన్నై అధికారులు మూడు కేసులు నమోదు చేశారని ఆయన వివరించారు.
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ యాక్ట్ నమోదు
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ భాస్కరన్‌ను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అంబురాజన్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలో 29 కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.
భాస్కరన్ తమిళనాడు రాష్ట్రం నుంచి కూలీలను తీసుకువచ్చి జిల్లాలోని అట్లూరు, గువ్వలచెరువు ఘాట్, వీరబల్లి, సుండుపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికించేవాడు. అనంతరం వాటిని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి:వేయి కిలోల గంజాయి స్వాధీనం