PD Act against Naveen Reddy: తెలంగాణలో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటి వరకు నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో 5 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్న రాచకొండ సీపీ చౌహాన్.. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు అధికారంగా ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే నవీన్‌రెడ్డితో పాటు మరో 40 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వైశాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాలతో.. వాటిని నవీన్‌రెడ్డి షేర్ చేసినట్లు పేర్కొన్నారు.
Naveen Reddy Arrest In Dentist Kidnap Case : అమెరికా పెళ్లి సంబంధంరావడంతో హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంతవైద్యురాలికి గత సంవత్సరం డిసెంబర్ 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం అనుచరులతోపాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.
ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు. నవీన్ రెడ్డి సహా అంతా అదే రోజు ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.