యువత మత్తు(Drug addiction) వలయంలో కూరుకుపోతోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదకద్రవ్యాలుకూ(Drug addiction) విస్తరిస్తోంది. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం(నావల్టీ కికింగ్)తోనే ఎక్కువ మంది ఈ రొంపిలోకి దిగుతున్నారు. స్నేహితుల జన్మదిన వేడుకల్లో, వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం(cannabis) సాధారణమైపోయింది. ఆ తర్వాత గోవాలాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌కు అలవాటు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్(Drug addiction) కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలిదశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని అమృత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దేవికారాణి చెబుతున్నారు.
గుర్తించడం ఇలా..
విద్యార్థుల బ్యాగులలో లైటర్, ఐడ్రాప్స్, ఒసీబీ పేపర్ లాంటివి గమనిస్తే అనుమానించాలి. స్నేహితులతో టెర్రస్‌పై ఎక్కువ సమయం గడుపుతుంటే ఏంచేస్తున్నారో కనిపెట్టాలి.