youngstar died in scotland: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎరోనాటికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లిన గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన గిరీష్ కుమార్ ఈ నెల 19వ తేదీన స్కాట్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా మృతదేహాన్ని తమకు అప్పగించలేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. స్కాట్లాండ్ ప్రభుత్వం ఐదు రోజుల్లో డెడ్ బాడీని అప్పజెప్పుతామని చెప్పి.. ఇంతవరకు పంపలేదని వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
స్కాట్లాండ్లో కుమారుడు మృతి, మృతదేహం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
Parents waiting for sons deadbody చేతికందొచ్చిన కొడుకుని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. విదేశాలకు వెళ్లి ప్రయోజకుడవుతాడనుకున్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కుమారుడు వృద్ధిలోకి వచ్చాడనే వార్త విందామనుకున్న వారికి అతడు లేడు, ఇకరాడనే విషయం వినాల్సి వచ్చింది. కనీసం కొడుకు మృతదేహాన్ని చూద్దామనుకున్న వారికీ ఎదురుచూపులే మిగిలాయి. స్కాట్లాండ్లో మరణించిన కుమారుడి డెడ్‌బాడీని వెంటనే తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు.
parents await for son dead body