Gang robbers Arrest: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దోపిడీ దొంగల ముఠాను.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పల్నాడు జిల్లా నకిరికల్లు పోలీసులు పట్టుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఆరుగురు యువకులు.. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతాన్నారని పోలీసులు తెలిపారు. రెండు జిల్లాల్లో దాదాపు ఐదు చోట్ల దారి దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు. తాజాగా నరసరావుపేట రైల్వేస్టేషన్లో ఉన్న దంపతులపై దాడి చేసి... నగదు, బంగారం, సెల్ ఫోన్ లాక్కెళ్లారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు ఇవ్వగా.. సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా దొంగలను పట్టకుని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
సెల్ఫోన్ దొంగతనం చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు - పల్నాడు జిల్లా తాజా వార్తలు
ARREST: వాళ్లు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. దోపిడీలు చేస్తూ జల్సాలు చేస్తున్నారు. కానీ వాళ్లు కొట్టేసిన ఫోనే వాళ్లను పట్టిస్తుందని ఊహించలేకపోయారు. నరసరావుపేట రైల్వేస్టేషన్లో దంపతులపై దాడి చేసి.. సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాంకేతిక పరిజ్ఞానంతో దోపిడీ దొంగలను పట్టుకున్నారు.
arrest