తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఈ దందా ఆగట్లేదు. ఎక్కడికక్కడే రవాణా అడ్డుకుంటున్నా ఏదో మూల గంజాయి రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.
Ganja Seized in Sangareddy : 10 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే..? - Heavy cannabis seized in sangareddy
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్లు తీసుకొస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కంది గ్రామం వద్ద పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేయగా తుక్కు కింద గంజాయి మూటలు కనిపించాయి.
Ganja Seized in Sangareddy
సంగారెడ్డిలో 10 క్వింటాళ్ల గంజాయిని (Heavy cannabis seized) టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఏపీలోని విశాఖ నుంచి వస్తున్న లారీలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తుక్కు కింద గంజాయి మూటలు పెట్టి లారీలో అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:AP HIGH COURT ON DRUGS CASE: 'మాదకద్రవ్యాల కేసుల్లో.. పెద్ద తలకాయలను పట్టుకోరా?'