హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ముప్పల సాయికిరణ్(ఎన్జీఓస్ కాలనీ), మరమోని మధు(హస్తినపురం), సోమరౌతు రాజేశ్(ఎన్జీఓస్ కాలనీ), ఏటికల అన్వేశ్రెడ్డి(హస్తినపురం పోచమ్మ టెంపుల్ దగ్గర) వీరిని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా.. రాజేశ్మాత్రం ప్రైవేటు ఉద్యోగి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు - online cricket betting news
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు బెట్టింగ్ రాయుళ్లను హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు