GUNTUR ROAD ACCIDENT: గుంటూరు జిల్లా శావల్యాపురం మండల కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శావల్యాపురం నుంచి బొందిపాలెం వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద.. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శావల్యాపురానికి చెందిన పూజారి తురిమెల్ల భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి కాలుకి తీవ్ర గాయాలయ్యాయి.
GUNTUR ROAD ACCIDENT: శావల్యాపురంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. పూజారి మృతి - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
MAN DIED IN GUNTUR ACCIDET: గుంటూరు జిల్లా శావల్యాపురంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
శావల్యాపురంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. పూజారి మృతి
విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచాం అందించి.. క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Fb Cheating: అమ్మాయి పేరుతో చాటింగ్... కోటి కొల్లగొట్టిన కిలాడి దంపతులు