ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్త ఏడాది కేరింతలు.. కాసేపట్లోనే మృత్యు ఆర్తనాదాలు.. సీసీ కెమెరాలో హత్య దృశ్యాలు

By

Published : Jan 1, 2023, 1:35 PM IST

Updated : Jan 1, 2023, 6:25 PM IST

One Man Killed : నూతన సంవత్సర వేడుకల్లో అందరు కేరింతలతో సంబరాలు చేసుకుంటుంటే, ఆ ఇంట్లో మాత్రం మృత్యు ఆర్తనాదాలు ధ్వనించాయి. తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలులో ఇరుగు పొరుగుగా ఉన్న రెండు కుటుంబాల మద్య .. ఎప్పట్నుంచో వివాదాలు కొనసాగుతున్నాయి. కొత్త ఏడాది వేడుకల్లో కేక్ కట్ చేసే సమయంలో.. రగిలిన కోపం, హత్యకు దారి తీసింది. పక్కింటి యువకుడ్ని కత్తితో దారుణంగా పొడుస్తున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్టు అయ్యాయి.

Etv Bharat
Etv Bharat

Murder : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో దారుణహత్య జరిగింది. చిన్న అనే 24 ఏళ్ల యువకుడ్ని పాత కక్షల నేపథ్యంలో కత్తితో పొడిచి హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమరిపాలెం గ్రామానికి చెందిన చిన్న, ధర్మ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో కేక్​ కట్​చేస్తుండగా మరో సారి వివాదం తలెత్తింది. దీంతో ఇద్దరు గొడవకు దిగారు. పెద్దలు కలగజేసుకుని ఇద్దర్ని సముదాయించి గొడవ ప్రాంతం నుంచి పంపించేశారు. మళ్లీ అదివారం ఉదయం ధర్మ ఇద్దరు యువకులతో కలిసి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంతో అతనిని కత్తితో పొడవటంతో చిన్న ప్రాణాలు కోల్పొయాడని స్థానికులు అంటున్నారు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కేమెరాలో నిక్షిప్తమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కేక్​ కట్​ చేస్తుండగా వివాదం.. చెలరేగిన పాత కక్షలు.. ఆ తర్వాత ఏమైందంటే..!
Last Updated : Jan 1, 2023, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details