చిన్నపాటి నిర్లక్ష్యం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. చూస్తుండాగానే రక్తం పంచుకున్న బిడ్డ ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎల్బీనగర్(boy died in a car accident at lb nagar) ఠాణా పరిధిలో జరిగింది. తండ్రి నడుపుతున్న కారు కిందపడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు (lb nagar car accident ). కారును వాష్ చేసి అపార్ట్మెంట్లో పెడుతుండగా.. బాలుడు అకస్మాత్తుగా వచ్చి కారు కిందపడిపోయాడు.
తెలంగాణలోని సంగారెడ్డి జహీరాబాద్‌కు (zaheerabad) చెందిన లక్ష్మణ్, రాణికి అయిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప, ఏడాది వయసున్న బాబు ఉన్నారు. ఉపాధి కోసం ఏడాది క్రితం లక్ష్మణ్ కుటుంబంతో నగరానికి వలస వచ్చాడు. లక్ష్మణ్ కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా.. అతడి భార్య మన్సూరాబాద్, ఎల్బీనగర్లోని (boy killed in lb nagar) ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తోంది. ఇవాళ ఉదయం లక్ష్మణ్ కారు కడిగి అపార్ట్మెంట్లో పెడుతుండగా.. ఏడాదిన్నర బాలుడు అకస్మాత్తుగా వచ్చి కారు కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.