Fireworks explosion: దీపావళి వేళ రాజమహేంద్రవరంలో విషాదం చోటుచేసుకుంది. ఆవరోడ్‌లోని రైతు పేటలో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సామగ్రి చెల్లాచెదురైంది. శిథిలాలు ఎగిరిపడి పక్కనున్న అపార్ట్‌మెంట్ అద్దాలు పగిలాయి. కోటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయారు. ఆయన శరీరం తునాతునకలైంది. అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Fireworks explosion: బాణసంచా పేలుడు... ఒకరు మృతి... ఎక్కడంటే..? - రాజమహేంద్రవరం నేర వార్తలు
Fireworks explosion: రాజమహేంద్రవరంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి శరీరం తునాతునకలైంది. బాణసంచా తయారు చేస్తుండగా ఘటన జరిగిందనే వాదన వినిపిస్తుండగా పోలీసులు మాత్రం నిర్ధరించలేదు.
అల్యూమినియం సామగ్రి తయారీ కార్మికుడైన కోటేశ్వరరావు దీపావళి సందర్భంగా ఇంట్లో టపాసులు తయారు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా పేలుడు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో కోటేశ్వరరావు భార్య పనికి వెళ్లగా కుమారుడు అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. పాప కింద ఆడుకుంటోంది. భాధిత కుటుంబసభ్యులను ఎంపీ భరత్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితోపాటు ముఖ్యులు పరామర్శించారు. బాణసంచా వల్లే పేలుడు జరిగిందనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని....దర్యాప్తు సాగుతోందని పోలీసులు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: