అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకున్న వృద్ధురాలు.. జేసీబీతో ఢీకొట్టిన డ్రైవర్ - old woman died in visakha
13:42 October 26
ఆనందపురం మండలం పొడుగుపాలెంలో దారుణం
OLD WOMAN DIED : విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెంలో విషాదం నెలకొంది. అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకున్న శిణగం ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలిని జేసీబీతో బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు పాలైన ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
పొడుగుపాలెంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో 10 మంది.. వారసత్వంగా వస్తున్న భూముల్లో పాకలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తామని.. అందరూ ఖాళీ చేయాలని చెప్పడంతో బాధితులంతా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో నేడు వీఆర్వో అప్పల రెడ్డి.. సచివాలయ సిబ్బందితో కలిసి.. జేసీబీ సాయంతో చదును చేసేందుకు ప్రయత్నం చేశారు. తొలగింపులను వృద్ధురాలు శిణగం ఎల్లమ్మ అడ్డుకోవడంతో.. జేసీబీ డ్రైవర్ నడుపూరు సురేష్ కావాలనే ఆమెను ఢీకొట్టాడని మృతురాలి కుమారుడు ఆరోపించాడు. ఘటనా స్థలానికి ఆనందపురం సీఐ రామచంద్రరావు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
ఇవీ చదవండి: