DEATH:విజయవాడ పాతబస్తీలోని నైజాం గేట్ సమీపంలో నివాసం ఉంటున్న కుంబా బెబమ్మ(80) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వృద్ధురాలు మరణించిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కొత్తపేట టూటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో బంగారం కోసం ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పశ్చిమ డివిజన్ ఏసీపీ హనుమంతరావు ఆరా తీస్తున్నారు. మృతురాలికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం ఒంటరిగా నివాసం ఉంటున్నట్లు సమాచారం.
DEATH: విజయవాడలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి.. అసలేమైంది..? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
DEATH: ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విజయవాడ పాతబస్తీలో జరిగింది. వృద్ధురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో బంగారం కోసం ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

DIED