gas cylinder blast: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ప్రమాదంలో ఇంటి యజమాని చెన్నరాయప్పకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇంటిలో గ్యాస్ లీక్ అయ్యిందని.. ఇల్లు మొత్తం గ్యాస్‌తో నిండిన విషయం తెలియక చెన్నారాయప్ప స్టవ్ వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇంట్లో ఇరుక్కుపోయిన వృద్ధుడిని స్థానికులు బయటకు తీసుకువచ్చి, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులంతా కర్ణాటకలోని తుమకూరులో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. మూడు నెలల క్రితం కొత్తగా నిర్మించిన ఇంటిలో చెన్నరాయప్ప కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.