ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

murder: పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరికి వచ్చాడు.. మూడు రోజుల తర్వాత.. - ఏపీ 2021 వార్తలు

old-couple-murder-in-brahmagari-matam-village-kadapa-distrcit
బ్రహ్మంగారిమఠంలో వృద్ధ దంపతుల హత్య

By

Published : Sep 3, 2021, 8:26 AM IST

Updated : Sep 3, 2021, 10:51 AM IST

08:24 September 03

తలుపులు తెరిచిన వాళ్లపై దాడి.. గాయలపాలైన ముగ్గురు స్థానికులు..

         కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ కాలనీలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన తొరివేముల నాగయ్య, నాగమ్మ దంపతులను దగ్గరి బంధువే హత్య చేయడం సంచలనంగా మారింది. చాపాడు మండలం నాగులప్లలెకు చెందిన వీరయ్య నాలుగు రోజుల క్రితమే... తన పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరకు వచ్చాడు. మూడ్రోజులుగా బాగానే ఉన్న వీరయ్య... గురువారం అర్ధరాత్రి పెద్దమ్మ, పెద్ద నాన్నలు నిద్రిస్తుండగా రాడ్డుతో వారి తలలు పగులగొట్టాడు. తీవ్ర గాయాలపాలైన నాగయ్య, నాగమ్మ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

తలుపులు తెరిచిన వాళ్లపై కూడా దాడి.. 

           తెల్లవారుజామునే పాలకోసం వెళ్లే నాగమ్మ ఎంతకీ రాకపోవడంతో... పాలు పోసేందుకు ఇంటివద్దకు వెళ్లిన మహిళ తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది. ఎంతకీ వాళ్లు చప్పుడు చేయకపోవడం, తులుపులు తెరవకపోవడంతో.. స్థానికులను పిలిచి విషయం తెలిపింది. వారంతా కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా... లోపలే ఉన్న నిందితుడు వీరయ్య.. వీరిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. పారిపోతున్న వీరయ్యను వెంబడించి స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. 

స్వయానా చెల్లెలి కొడుకే...

      వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు పాల్పడిన వీరయ్య... నాగ‌మ్మకు స్వ‌యానా చెల్లెలి కుమారుడు. వీరయ్య మాన‌సిక‌ ప‌రిస్థితి స‌రిగా లేని కార‌ణంగానే దారుణానికి ఒడిగ‌ట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూర‌ల్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇదీ చూడండి:Fire accident: వీరపనేనిగూడెంలోని ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

Last Updated : Sep 3, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details