అక్రమ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం.. రూ.3 కోట్ల విలువైన సరుకు ధ్వంసం - road roller
Illegal Liquor Destroyed: నెల్లూరులో అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. పొదలకూరు రోడ్డులోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం మైదానంలో.. దాదాపు 3 కోట్ల 14 లక్షల విలువైన 74 వేల 547 మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీల్లో దొరికిన 15వేల 719 లీటర్ల మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కర్నాటక, గోవా, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన డ్యూటీ ఫైడ్ లిక్కర్ ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
1