ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీలోని వారంతా "ఊఁ" అనేశారు! వీళ్లు మామూలోళ్లు కాదు.. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా నేతలు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా! పెద్ద పెద్ద అధికారులు.. పోలీసు ఆఫీసర్లు కూడా ఈ బ్యాచ్‌లో ఉన్నారు! పిలవగానే సెంటు కొట్టుకొని మరీ ఎగేసుకు వెళ్లిపోయారు.. జల్సా చేశారు.. కానీ, ఆ తర్వాత అర్థమైంది బతుకు సాలెగూడులో చిక్కుకున్న గుడ్డి ఈగలా మారిపోయిందని! ఇప్పుడు గిల్లా.. గిల్లా.. గిల్లా.. కొట్టేసుకుంటున్నారు..!!
ఆమె పేరు అర్చనా నాగ్. పోస్ట్ కెసింగ, తాలూకా కెసింగ, జిల్లా కలహండి, రాష్ట్రం ఒడిషా. పిన్ కోడ్ 766012. డబ్బు ఎవరికొద్దు? అర్చనకు కూడా కావాలి. అందుకే.. ఉన్నఊరు వదిలేసి, భువనేశ్వర్‌కు మకాం మార్చింది. అక్కడ ఓ బ్యూటీ పార్లర్లో చేరింది. ప్చ్.. ఏం లాభం? ఆంటీగారి సంపాదన కాఫీ టీలకు కూడా సరిపోవట్లే.
ఇప్పుడేం చేద్దాం అన్నాడు భర్త. "వ్యాపారం చేద్దాం". దానికి పెట్టుబడి కావాలిగా? "ఉందిగా!" ఎక్కడ? "దేవుడిచ్చిన అందం.. 36.. 24.. 36 మిస్ యూనివర్స్ దేహసౌష్టవం.. ఇంతకు మించిన పెట్టుబడి ఏముంటుంది?" యూ మీన్ దట్టా..? ఐ థింక్ వాటో వాటు! "ఐ మీన్ దిస్సే.. ఏమంటావ్?" పర్వాలేదంటావా? "మనకు ఈ బాధలు తప్పాలంటే.. తప్పదు నాథ!" సరేలే కానీయ్. అలా.. బెడ్ రూమ్ డోర్ ముందు రిసెప్షనిస్టుగా మారిపోయాడు భర్త జోగ బంధు నాగ్.
భర్తే లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఇక అడ్డేముంది? బ్యూటీ పార్లర్లో పని చేస్తూనే.. తన గోడచాటు వ్యాపారం మొదలు పెట్టింది అర్చన. "వ్రతం చెడినా.. ఫలం దక్కాలి కదా" అన్న కాన్సెప్ట్ ప్రకారం.. బెడ్ రూమ్‌లోకి ఎవరినిబడితే వాళ్లను కాకుండా.. బాగా బలిసిన బ్యాచ్‌నే పిలవాలని భార్యాభర్తలు డిసైడ్ అయ్యారు.
స్వయంగా అమ్మాయే వచ్చి.. "ఐ వాంట్ యూ" అంటే.. నో చెప్పే మగాళ్ల పర్సంటేజ్ ఒకటీ రెండుకు మించదు. రాజకీయ నేతల్లో ఈ పర్సెంట్ మరింత హీనం అని భావించారు వారిద్దరూ.. పైగా అడ్డగోలుగా సంపాదించి ఉంటారని వాళ్లనే టార్గెట్ చేశారు. భాజపా, కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి రాజకీయ పార్టీల నేతలతోపాటు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న అధికారులు.. బాగా బలిసిన పారిశ్రామిక వేత్తలు, చివరకు పోలీసు అధికారులు కూడా అర్చనా ఇంటి కాలింగ్ బెల్ కొట్టడం మొదలు పెట్టారు.