Noise of rowdy sheeters is getting louder in visakha: విశాఖలో రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నగర బహిష్కరణ చేస్తామని అధికారులు హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. ఆదివారం సాయంత్రం నెహ్రూబజార్ వద్ద రవి అలియాస్ ముక్కురవి అనే రౌడీ షీటర్... రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అలియాస్ బాబులు రెడ్డి అనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ ముక్కు రవి... బాబులును పరిగెత్తించి కొడుతూ ద్వారాకనగర్ పొలాక్స్ స్కూల్ వద్ద కర్రతో తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయలతో రోడ్డుపై పడి ఉన్న బాబులును స్థానికులు ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ద్వారకా ఏసీపీ మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
విశాఖలో శ్రుతిమించిపోతున్న రౌడీ షీటర్ల ఆగడాలు - Visakha Crime
Noise of rowdy sheeters is getting louder in visakha: విశాఖలో రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. నెహ్రూబజార్ వద్ద ముక్కురవి అనే రౌడీ షీటర్.. రాజమండ్రికి చెందిన బాబులు రెడ్డి అనే వ్యక్తిని కర్రతో తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరిన అతన్ని స్థానికులు ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
విశాఖలో శ్రుతిమించిపోతున్న రౌడీ షీటర్ల ఆగడాలు