ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Marriage Frauds in India: ఫేస్‌బుక్ ప్రేమ.. ఆపై పెళ్లి.. "బోత్ ఆర్ నాట్ సేమ్" - Nigerians cheating

Marriage Frauds in India: అనుకోకుండా ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే.. అవుతలి నుంచి అందమైన అమ్మాయి. మాటలతో సమ్మోహనపరిచింది. ఆమెకు అడిక్ట్ అయ్యేలా చేసింది. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని మనసులో మాట చెప్పింది. ఆ మాయలాడి ప్రేమలో కూరుకుపోయి.. ఓకే అనేశాడీ యువకుడు. ఆ తర్వాతే తెలిసింది. "బోత్ ఆర్ నాట్ సేమ్" అని.

Marriage Frauds in India
ఫేస్‌బుక్ ప్రేమ.. ఆపై పెళ్లి.. బోత్ ఆర్ నాట్ సేమ్

By

Published : Dec 26, 2021, 8:24 PM IST

Marriage Frauds in India: నమస్కారం నాపేరు లావణ్య. మా పూర్వీకులు భారతీయులే. మా కుటుంబం యార్క్‌షైర్‌లో స్థిరపడింది. అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. కొన్నేళ్ల నుంచి బహుళజాతి సంస్థలో కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. నా తల్లిదండ్రుల చివరి కోరిక తెలుగురాష్ట్రాల్లో ఉంటున్న వారిని పెళ్లి చేసుకోవాలని. మీకు ఇష్టమైతే మాట్లాడండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా వచ్చిన ప్రేమపూర్వక అభ్యర్థన. కొద్దిరోజులు ఇద్దరూ వాట్సాప్‌ నంబర్‌ ద్వారా మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం ఉంగరం కొనేందుకు 85వేల పౌండ్లు పంపుతున్నాను తీసుకోండి అంటూ నెలరోజుల క్రితం లావణ్య చెప్పింది. మరుసటి రోజు దిల్లీలోని కొరియర్‌ సంస్థ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫోన్‌ వచ్చింది. చెక్కును మార్చుకోవాలంటే రుసుం చెల్లించాలని కోరగా.. సరేనన్నాడు. కస్టమ్స్, ఆదాయపన్ను, సుంకాల పేరుతో రూ.95లక్షలు కట్టాడు. కట్ చేస్తే తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్‌.

లండన్ కాదు దిల్లీనే..
Cyber Crime News: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను లావణ్యపేరుతో మోసం చేసింది లండన్‌లో ఉంటున్న యువతి కాదు.. దిల్లీ వసంత్‌ విహార్‌లో ఉంటున్న నైజీరియన్‌. ఈమే కాదు దిల్లీ నగరం, శివారు ప్రాంతాల్లో 40 వేలమంది నైజీరియన్లు నివాసముంటున్నారు. వీరిలో చాలామంది ఫేస్‌బుక్‌ ద్వారా యువతులు, వృత్తినిపుణులను పరిచయం చేసుకుని ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. పెళ్లిచేసుకుందామంటూ ప్రతిపాదిస్తున్నారు. బాధితులు అంగీకరించిన వెంటనే నిశ్చితార్థం కానుకలు, గిఫ్ట్‌చెక్కుల పేరుతో మోసాలు చేసి రూ.లక్షలు కాజేస్తున్నారు.

మాటలతోనే సమ్మోహనం..
Cheating in Facebook: ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్న సైబర్‌ నైజీరియన్లు.. బాధితులను మాటలతోనే సమ్మోహనులయ్యేలా చేసుకుంటున్నారు. వాట్సాప్‌ ద్వారా మాట్లాడుతున్నా సరే ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా దగ్గరి మనుషులు ప్రవర్తించినట్టుగా ఉంటున్నారు. యువతులును ఎంచుకునేప్పుడు యువకుల ఫొటోలతో ప్రొఫైల్‌ తయారు చేస్తున్నారు. యువకులు, వృత్తి నిపుణులను మోసం చేయాలనుకునేప్పుడు అందమైన యువతుల పేరుతో పరిచయం చేసుకుంటున్నారు. వీరిబారిన పడి రూ.లక్షలు నష్టపోయిన బాధితులను పోలీసులు ప్రశ్నిస్తే.. వారు నిజాయతీపరులు నాకు పౌండ్లు, డాలర్లు పంపుతున్నారు. ఎయిర్‌పోర్టు, కొరియర్‌ సంస్థలే మోసం చేస్తున్నాయంటూ చెబుతున్నారు.

బంగారు వజ్రాభరణాలు.. పౌండ్లు.. డాలర్లు
Nigerian Marriage Fraud: విదేశాల్లో ఉంటున్న వ్యాపారులు, వృత్తి నిపుణుల పేర్లతో ఫేస్‌బుక్‌ ప్రేమాయణం పేరుతో సైబర్‌ నేరస్థులు మూడునాలుగేళ్ల నుంచి మోసాలు చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామంటూ వారికి బంగారు, వజ్రాభరణాలు, వేల పౌండ్లు, డాలర్ల విలువైన గిఫ్ట్‌చెక్కులు పంపుతున్నారు. వాటిని బాధితులు తీసుకునేప్పుడు బ్యాంక్, విమానాశ్రయ అధికారుల పేర్లతో ఫోన్లు చేసి మోసం చేస్తున్నారు. బాధితులతో వాట్సాప్‌ ద్వారా మాట్లాడుతున్న నైజీరియన్లు.. వారుంటున్న ప్రాంతాల విశేషాలు, పనిచేస్తున్న కార్యాలయాలు, కార్పొరేట్‌ సంస్థల వివరాలను సరిగ్గా వివరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లోని ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సాప్‌ ద్వారా మాట్లాడేటప్పుడు ఏ దేశం నుంచి ఫోన్‌ చేస్తున్నారో అక్కడి ఐఎస్‌డీ నంబర్‌ బాధితుల చరవాణిలో కనిపించేలా చేస్తున్నారు.

ఇలా నేరాలు..

నేరాలు(పెళ్లిపేరుతో) 2017 2018 2019 2020 2021(నవంబరు వరకు)
కేసులు 109 127 102 86 56
కాజేసిన సొమ్ము (రూ.కోట్లలో) 11.85 13.20 11.40 9.06 4.75

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details