ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 21, 2021, 7:02 AM IST

ETV Bharat / crime

NIA RAIDS: మురహరిపల్లిలో ఎన్‌ఐఏ సోదాలు.. పేలుడు పదార్థాలపై ఆరా..!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో దొరికిన పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి మేడ్చల్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA Raids) సోదాలు కొనసాగుతున్నాయి. మేడ్చల్​లోని మురహరిపల్లిలో క్రషర్​గా పని చేస్తున్న కొమ్మురాజుల కనకయ్య ఇంట్లో నిన్న రాత్రి తనిఖీలు చేశారు.

NIA Raids
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA Raids) సోదాలు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు (NIA Raids) నిర్వహించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో తనిఖీలు చేపట్టింది. జిల్లాలోని మురహరిపల్లిలో క్రషర్‌ పని చేస్తున్న వరంగల్‌ వాసి కొమ్మురాజుల కనకయ్య ఇంట్లో నిన్న రాత్రి ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దుమ్ముగూడెంలో పట్టుబడిన పేలుడు పదార్థాల కేసులో కనకయ్య అన్న కుమారుడు నాగరాజుకు పరిచయం ఉన్న వాళ్లు పటాన్ చెరువులో సెల్లార్ పనుల కోసం పేలుడు పదార్థాలను తీసుకెళ్లినట్లు గుర్తించారు.

వీరు దుమ్ము గూడెంలో పట్టుబడిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారన్న అని అడగ్గా.. కనకయ్య పేరు చెప్పడంతో ఆయన నివాసముంటున్న ఇంట్లో తనిఖీలు చేశారు. ఏమీ లభ్యం కాకపోవడంతో పూర్తి వివరాలు సేకరించి వదిలేశారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసు (Case of Explosive)లో మొత్తం 5 జిల్లాల్లో ఎన్​ఐఏ సోదాలు (NIA Raids) నిర్వహించింది.

మహబూబ్​నగర్​, వరంగల్​, జనగామ, భద్రాద్రి, మేడ్చల్​ జిల్లాల్లో సోదాలు చేసింది. నిన్న జరిగిన తనిఖీల్లో 400 ఎలక్ట్రిక్​ డిటోనేటర్లు (Electric Detonators), 500 నాన్​ ఎలక్ట్రిక్​ డిటోనేటర్ల (Non-Electric detonators)తో పాటు 400 జిలెటిన్​ స్టిక్స్ (Gelatin sticks), 549 మీటర్ల ఫ్యూజ్​ వైర్లు (Fuse wires) స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ, గ్రనేడ్​ లాంఛర్ల తయారీకి అవసరమైన సామాగ్రి గుర్తించామని... పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్​ఐఏ పేర్కొంది. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు నేత హిడ్మా (Maoist Leader Hidma )కు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎన్​ఐఏ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details