ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Newly married women suicide: కాళ్ల పారాణి ఆరకముందే... యువతి ఆశలు ఆవిరి..! - నవ వధువు బలవన్మరణం

Newly married women suicide: మూడు ముళ్లు.. ఏడడుగులు.. కోటి ఆశలతో అత్తవారింట అడుగిడిన ఓ యువతి ఆశలు కాళ్ల పారాణి ఆరకముందే ఆవిరయ్యాయి. పెళ్లయిన మొదటి రోజు నుంచే ప్రారంభమైన వేధింపులు ఆ అబల ప్రాణం తీసుకునేదాకా ఆగలేదు. అదనపు కట్నం వేధింపులతో వివాహమై 20 రోజులు తిరగకుండానే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.

suicide
suicide

By

Published : Mar 3, 2022, 10:38 PM IST

Newly Wed Bride Suicide in Asifabad: కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన ఓ నవ వధువు ఆశలు అడియాసలయ్యాయి. వివాహమై నెల రోజులైనా తిరగకుండానే అదనపు కట్నం కోరల్లో చిక్కుకుని మనోవ్యధకు గురైంది. కట్టుకున్నవాడి వేధింపులు తాళలేక... కన్నవారికి బరువు కాలేక బలవన్మరణానికి పాల్పడి ఆ యువతి తనువు చాలించింది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలంలోని కొండపల్లిలో తీవ్ర విషాదం నింపింది.

అసలేం జరిగిందంటే...

Newly wed bride commit suicide: కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం శంకర్, సత్తక్క దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె శారదకు గత నెల 11న పాపన్ పేట గ్రామానికి చెందిన తిరుపతితో వివాహం జరిపించారు. పెళ్లైన మొదటి రోజు నుంచే భర్త మద్యం తాగి అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.

15 రోజుల్లోపే 2 సార్లు...

women suicide: ఆ వేధింపులు తట్టుకోలేక పెళ్లైన 15 రోజుల లోపే రెండు సార్లు పుట్టింటికి వచ్చింది. పెద్దలు నచ్చజెప్పి మళ్లీ అత్తారింటికి పంపించారు. అయినా అతని బుద్ధి ఏమాత్రం మారలేదు. మరల వేధించడం మొదలు పెట్టడంతో ఈ నెల 1న మరోసారి తల్లిగారి ఇంటికి వచ్చింది. చివరకీ భర్త వేధింపులతో మనోవ్యధకు గురైన శారద బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి ఆమెను గమనించి.. వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Interstate gang arrested : గుంటూరులో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్...

ABOUT THE AUTHOR

...view details