Shilpa Chowdary Case: అధిక వడ్డీల పేరుతో కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వని కేసులో నిందితురాలైన శిల్పాచౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. రెండు రోజుల కస్టడీ అనంతరం శిల్పాచౌదరిని తెలంగాణ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు.. గండిపేట సిగ్నేచర్ విల్లాలోని శిల్ప ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శిల్ప ఇంట్లో పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీలో శిల్పా చౌదరి నుంచి పలు విషయాలను పోలీసులు సేకరించారు.
రెండు రోజుల కస్టడీలో..
పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీ తీసుకున్నారు. పోలీసులు 7 రోజుల కస్టడీ అడగ్గా.. కోర్టు రెండు రోజులు అనుమతి ఇచ్చింది. చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్సింగి ఠాణాకు తీసుకెళ్లారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీశారు.
ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు..?
శిల్పా చౌదరిని మొదటి రోజు ఆరు గంటల పాటు పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించిన పోలీసులు.. ఆమె బినామీలు, బ్యాంకు ఖాతాలపై లోతుగా ఆరా తీశారు. ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదులపై శిల్ప వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. రెండో రోజు విచారణలో.. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించిందనే కోణంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. బాధితుల దగ్గర తీసుకున్న డబ్బును రాధిక అనే మహిళకు పెట్టుబడిగా ఇచ్చినట్లు శిల్ప వెల్లడించింది. స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా రాధికకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపింది. సదరు రాధిక తనకు తిరిగి చెల్లించలేదని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపింది. శిల్ప పేర్కొన్న రాధికను పోలీసులు ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
శిల్పా మాయల్లో కొత్త కోణం..
Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి మాయలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు అధిక వడ్డీల ఆశచూపి మహిళల నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి కేసులో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్ పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలున్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ.కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ ఒక్కొక్కరూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...