Arrest in Dowry case: నెల్లూరు జిల్లాకు చెందిన రాజమోహన్ అనే వ్యక్తిని చైన్నై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్ నుంచి చైన్నై చేరుకున్న ప్రయాణికులను తనిఖీ చేస్తున్న క్రమంలో.. రాజమోహన్ పాస్‌పోర్ట్‌ను అధికారులు పరిశీలించారు. వాంటెడ్ లిస్ట్‌లో అతని పేరు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు మహిళా పోలీసులు రాజమోహన్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు సమాచారం.
వరకట్న వేధింపుల కేసు.. రెండేళ్ల తర్వాత అరెస్ట్.. ఎక్కడంటే..!
Dowry case: అతడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అరెస్ట్ చేద్దామనుకున్న పోలీసులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. రెండేళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు. సింగపూర్ నుంచి చైన్నైై విమానాశ్రయానికి చేరుకున్న ఇతని పాస్‌పోర్ట్ చూసి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే.. రెండేళ్ల క్రితం రాజమోహన్ వేధిస్తున్నాడని అతని భార్య నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నెల్లూరు మహిళా పోలీసులు అతడిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ 2021లో రాజమోహన్‌ను వాంటెడ్‌గా ప్రకటించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు తెలిపారు. అయితే అప్పటినుంచి అతడు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. తాజాగా సింగపూర్ నుంచి చైన్నై వచ్చిన క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: