Vaishali Kidnap case update: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డి కస్టడీ పై కోర్టులో విచారణ కొనసాగింది. నిందితుడుని పోలీసులు ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఒక్కరోజు కస్టడీకి అప్పగిస్తామని కోర్టు తెలిపింది. ఒక్క రోజు సరిపోదని, నవీన్‌రెడ్డితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి తెలపారు. దీంతో కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
సంచలనం సృష్టించిన దంత వైద్యురాలి కిడ్నాప్ కేసు విచారణ వాయిదా... - Latest news in vaisalli case
Vaishali Kidnap case update: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. హైదరాబాద్ మన్నెగూడ దంత వైద్యురాలి కిడ్నాప్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు అడిగిన గడువు కోర్టు ఇవ్వకపోవడంతో కేసు వాయిదా పడింది.
![సంచలనం సృష్టించిన దంత వైద్యురాలి కిడ్నాప్ కేసు విచారణ వాయిదా... Vaishali Kidnap case update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17267252-900-17267252-1671604959209.jpg)
అసలేం జరిగిందంటే..తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని, మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చతార్థం అని తెలిసింది. పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకు పోయాడు. సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటన జరిగిన 6 గంటలలోపే పోలీసులు అమ్మాయిని రక్షించారు.
ఇవీ చదవండి: