ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దంత వైద్యురాలి అపహరణ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్​ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు - Dentist Kidnap Case in hyd

Naveen Reddy Arrest In Dentist Kidnap Case : హైదరాబాద్‌ మన్నెగూడలో దంత వైద్యురాలి అపహరణకేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అతడి వద్ద నుంచి అయిదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Naveen Reddy Arrest In Dentist Kidnap Case
Naveen Reddy Arrest In Dentist Kidnap Case

By

Published : Dec 14, 2022, 10:58 AM IST

Naveen Reddy Arrest In Dentist Kidnap Case : తెలంగాణలో సంచలనం రేపిన దంత వైద్యురాలి కిడ్నాప్ ​కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా పెళ్లి సంబంధం రావడంతో హైదరాబాద్‌ మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈనెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి.. యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం అనుచరులతోపాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.

దంత వైద్యురాలి అపహరణ కేసు.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు నవీన్​ రెడ్డి

అమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు. నవీన్‌ రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలో యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో బయట నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్‌ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.

ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో విహవానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు.

మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్ ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని నవీన్ రెడ్డిని అప్రమత్తం చేశాడు. యువతిని ఇంటి వద్ద వదిలేద్దామని నిర్ణయించుకున్నారు. ముగ్గురు మధ్యలో దిగిపోగా మరొక స్నేహితుడు సాయంతో.. దంత వైద్యురాలిని నవీన్​ ఇంటికి పంపాడు. మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం వద్దకు రాగానే యువతికి ఫోన్‌ ఇచ్చి.. తన తండ్రికి ఫోన్‌ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమని సూచించారు.

నవీన్‌ రెడ్డి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు:యువతిని అక్కడే దించేసి ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి కారులో పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి.. మన్నెగూడకి వెళ్లి యువతిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ కేసులో మొత్తం 36మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా.. ఇప్పటికే ఇప్పటికే 32మందిని అరెస్ట్ చేశారు. మరో అయిదుగురిని కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నవీన్‌ రెడ్డి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు పట్టుబడక ముందు నిందితుడు నవీన్.. రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. తన స్థానంలో ఒక అమ్మాయి ఉంటే ఇదే విధంగా సమాజం వ్యవహరించేదా అని ప్రశ్నించాడు. ఈ గొడవను అమ్మాయి-అబ్బాయి గొడవగా కాకుండా కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా చూడాలని కోరాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details